అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంపై అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సూచించారు.







