UPDATED 22nd NOVEMBER 2017 WEDNESDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో వారం రోజులు పాటు నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ నాయకులు, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు, భాషా, సంస్కృతికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను గ్రంథాలయ విభాగం నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించే విధంగా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్మంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సులు అభ్యసిస్తున్న 12 వేల మంది విద్యార్థులకు పైగా విద్యను అభ్యసిస్తున్న ఆదిత్య క్యాంపస్ లో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ స్నేహితులతో కలిసి ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనేవిధంగా చొరవ చూపాలని, పోటీ ఉన్నప్పుడే మనలో దాగివున్న నైపుణ్యం బయటపడి జ్ఞానం పెంపొందుతుందన్నారు. అనంతరం ఈ వారోత్సవాలలో భాగంగా అధ్యాపకులకు, విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంసా పత్రాలు, అవార్డులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, గ్రంథాలయాధికారి కె. అశోక్ కుమార్, కె. నాగబాబు, కె. వెంకటరమణ, సి.హెచ్. వేణు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







