UPDATED 1st DECEMBER 2017 FRIDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్ సభ్యుల ఆధ్వర్యంలో "ప్రపంచ ఎయిడ్స్ డే"ని పురస్కరించుకుని ఎయిడ్స్ పై అవగాహనా సదస్సు శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.రమేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కబళించిన ఎయిడ్స్ మహమ్మారి బారిన పడకుండా గ్రామీణ ప్రాంతాలు, పేదప్రజలు, నిరక్షరాస్యులకు ఎయిడ్స్ పై విద్యార్థులు అవగాహన కల్పించాలని, ఈ వ్యాధిని మనదేశం నుంచి పారద్రోలేందుకు యువత నడుం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్లు బాల మోహన్ రాజు, ఎం. సోమిరెడ్డి, అధిక సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







