TualsiReddy: రాష్ట్రానికి బీజేపీ శని గ్రహణం అయితే వైసీపీ, జనసేనలు రాహు కేతువులు: తులసిరెడ్డి

UPDATED 24th MARCH 2022 THURSDAY 06:00 PM

TualsiReddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ శని గ్రహణం అయితే వైసీపీ, జనసేనలు రాహు కేతువుల్లా తయారయ్యాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. తులసిరెడ్డి అన్నారు. గురువారం ఆయన కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్ష పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యపానం నిషేదిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చారని.. అయితే ఇప్పుడు సొంత బ్రాండ్ లతోనే మద్యంపైనే అత్యధిక సంపాదన రాబడుతున్నారని తులసిరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మద్యపాన నిషేధం హామీని అమలు చేస్తారా లేక మాట తప్పిన వారిలా మిగిలిపోతారా అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కల్తీ సారా లేదంటూనే.. కోట్ల లీటర్ల సారా ధ్వంసం చేశామని అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్పడం చూస్తుంటే..ప్రభుత్వం ఎంతటి అబద్దాలు చెబుతోందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.ఇక రాష్ట్రానికి బీజేపీ శని గ్రహణం అయితే వైసీపీ, జనసేనలు రాహు కేతువులుగా మారారని తులసిరెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ రాయలసీమకు ద్రోహం చేసిందని..ప్రత్యేక ప్యాకేజి అంటూ ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ నుంచి.. జనసేన రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూడడం సిగ్గుమాలిన చర్య అని తులసిరెడ్డి అన్నారు. జనసేన బీజేపీ రోడ్ మ్యాప్ అడగడం కంటే బీజేపీలో విలీనం చేస్తే మంచిదని ఎద్దేవాచేశారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు కేంద్రం చేతులో కీలు బొమ్మలుగా మారాయని తులసిరెడ్డి అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us