రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 9th JUNE 2017 FRIDAY 2:00 PM

పెద్దాపురం: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) అన్నారు. మండలంలోని జె. తిమ్మాపురం గ్రామంలో వ్యవసాయశాఖ,అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పూర్ణిమ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా నాగలి తో పొలాన్ని దున్ని అందరిని ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎం.రత్నప్రశాంతి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అలాగే రైతులు సేంద్రియ వ్యవసాయ పద్దతులను మాత్రమే అవలంబించాలన్నారు. పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు సస్య రక్షణ చర్యలు చేపట్టాలని, విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. అలాగే ఏవో కొల్లి ద్వారకాదేవి, ఏపీఎం ఐపి ఏరియా ఇంచార్జ్ ఎం.చిలకమ్మ, కాండ్రకోట పశువైద్యాధికారి డాక్టర్ రాకేష్ మాట్లాడారు. అనంతరం స్టాల్స్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, సర్పంచ్ కందుల శేష కుమారి, మండల టిడిపి ఉపాధ్యక్షుడు మల్లిపూడి శ్రీరామచంద్రప్రసాద్, ఎంపిటిసి సూర్యప్రభావతి, పచ్చిపాల ప్రసాదరావు ( గోరింట ప్రసాద్), అభ్యుదయ రైతు పాలచర్ల విశ్వనాథం, పలు గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us