Suicide: కడపలో ఏఆర్‌ ఎస్‌ఐ చంద్రరావు ఆత్మహత్య

కడప (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: కడపలో ఏఆర్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న చంద్రరావు(25) ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రరావు కడపలో ఒంటరిగా ఉంటున్నారు. స్థానికుల ద్వారా ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సమస్యలతో చంద్రరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us