UPDATED 16th FEBRUARY 2022 WEDNESDAY 08:30 PM
హైదరాబాద్: నగరంలో క్రిప్టోకరెన్సీ పేరుతో సైబర్ కేటుగాళ్లు భారీ మోసం చేశారు. అంబర్‌పేట్‌కు చెందిన యువకుడిని కేటుగాళ్లు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ట్రాప్ చేశారు. యూకేలో క్రిప్టో కరెన్సీ వ్యాపారంతో తక్కువ వ్యవధిలో కోట్ల సంపాదించవచ్చని యువకుడిని కేటుగాళ్లు నమ్మించారు. Trust value యూకే డాట్ కాం వెబ్‌సైట్ ద్వారా యువకుడితో పాటు అతడి స్నేహితుల నుంచి 17 లక్షలను నిందితులు కాజేశారు.







