UPDATED 26th APRIL 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక బళ్ల మార్కెట్ సెంటర్ లో గల శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం వాసవీ యంగ్ బాయ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పరిసర గ్రామాలకు చెందిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి మట్టపల్లి రమేష్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాల శ్రీను, కాకినాడ హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వైద్యులు స్వాతి, క్రాంతి కుమార్, లక్ష్మీప్రసన్న, శ్రీనుబాబు, ఆచార్య, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.







