ఏజెన్సీ ఏరియాల్లో ప్రత్యక్షంగా తిరగడంవల్ల స్ధానిక సమస్యలు దృష్టికి వచ్చాయి

UPDATED 10 th JULY 2017 MONDAY 8:00 PM

విశాఖపట్టణం: అరకు, పాడేరు గిరిజన, ఏజెన్సీ ఏరియాల్లో ప్రత్యక్షంగా తిరగడంవల్ల స్ధానిక సమస్యలు తనకు పూర్తిగా తెలిశాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ సంధర్భంగా ఆయన గిరిజన, ఏజెన్సీ ఏరియాల్లో సోమవారం పర్యటించారు. అనంతరం పాడేరు ఐటీడీఏ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మార్చి నెలలోనే అంటువ్యాధులు నివారణ, దోమల నియంత్రణ పై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, గిరిజన  గ్రామాలలో పారిశుధ్యం మెరుగు, దోమల నియంత్రణకు అన్నిశాఖలతో చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన సంతలలో మాంసం విక్రయాలపై స్ధానిక సంఘాలు, ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర సమయాలలో గిరిజనులను వైద్యసేవలకు తరలించే ప్రైవేట్ వాహనాలకు ఇంధన ఖర్చు ఇవ్వాలని, కొన్ని శాఖల ఆధికారులు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని, గిరిజనుల ఇళ్ళలో కూడ దోమల మందు పిచికారీ చేసేందుకు సిబ్బందికి సరైన సూచనలిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది నియామకాలు చేపట్టే కార్యక్రమం ప్రారంభమైయ్యిందని, పెద్దబయలు మార్కెట్ లో మార్కెటింగ్ శాఖ ఆధికారితో మాట్లాడి షేడ్ వేయించి పారిశుధ్యం మెరుగుపరుస్తామన్నారు. గిరిజనులలో నెలకొన్న మూఢనమ్మకాలు, అపోహలను తొలగించేందుకు ప్రజలంతా స్వచ్చంధంగా కృషి చేయాలని సూచించారు.

 

 

 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us