Ram Charan: తల్లి, బిడ్డల బంధం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అది వెలకట్టలేని బంధం. అలాగే బిడ్డ గురించి తల్లికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచిన తల్లి బిడ్డకి సంబంధించి ప్రతి విషయాన్నీ గమనిస్తుంది. ఇక అబ్బాయిలైతే ఎప్పుడు అమ్మకూచిలానే పెరుగుతారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ సైతం అమ్మ చాటు బిడ్డనే అని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చాలాసార్లు ఈ విషయాన్ని చిరు బాహాటంగానే చెప్పుకొచ్చారు.
కాగా, మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్న రామ్ చరణ్.. తల్లికి భావోద్వేగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలో సురేఖకు ఒకవైపున చిరంజీవి, మరోవైపు రామ్ చరణ్ ఉన్నారు.







