ప్రతీ గ్రామానికి పరిశుభ్రమైన త్రాగునీరు

UPDATED 12th OCTOBER 2017 THURSDAY 10:30 AM

పెద్దాపురం: ప్రతీ గ్రామానికి పరిశుభ్రమైన త్రాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో రూ.ఐదు కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన రక్షిత మంచినీటి పథకానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యంగా ఏటిపట్టు గ్రామాలకు సురక్షితమైన త్రాగునీరును అందించనున్నట్లు చెప్పారు. ఈ పథకం నిర్మాణం ద్వారా ఏటిపట్టు గ్రామాలైన కట్టమూరు, జె .తిమ్మాపురం, కాండ్రకోట, మర్లావ, తూర్పుపాకలు తదితర గ్రామాలకు సురక్షితమైన త్రాగునీరు అందుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), ఎంపీపీ గుడాల రమేష్, జడ్పీటీసీ సుందరపల్లి శివనాగరాజు, కట్టమూరు పీఏసీఎస్ అధ్యక్షుడు చల్లా చినవీర్రాజు (చిన్ని), మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తెం వెంకట  శ్రీనివాసరావు (కోటి), గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఎంపీటీసీ సభ్యులు అడపా గంగాధరం, గుత్తుల సూర్యావతి, సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం, పెద్దాపురం పట్టణ టిడిపి అధ్యక్షుడు రంధి సత్యనారాయణ, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ సి.హెచ్ అప్పారావు, డీఈ కె.కె.ఎన్ కుమార్, జేఈ ఎం.సాయిలీల, తదితరులు పాల్గొన్నారు.

 

 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us