UPDATED 19th JULY 2017 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం, చల్లని తల్లి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాథం, చైర్మన్ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 28 రోజులకు రూ.10,34,464 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ సి ఎఫ్ వో బాబురావు సమక్షంలో హుండీని లెక్కించారు. ఈ కార్యక్రమంలో శివాలయం ఈవో పి.వి.ఎస్. మూర్తి, ఆలయ ధర్మకర్తలు ఆకుల మురళీ కృష్ణ, కొంగర సత్యనారాయణ, గోలి శ్రీరాములు, కోటాని గణేష్, గోమాడ అర్జునరావు, కొప్పర్తి కృష్ణ, రాయి విజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







