UPDATED 4TH august 2017 friday 3:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నాల్గవ రాష్ట్ర స్థాయి ఒలెంపిక్ గేమ్స్ ఖో-ఖో లో విశేష ప్రతిభ కనబరిచినట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా ఎం.కిరణ్ కుమార్, జి. వెంకటేష్, ఎన్. శివకుమార్, ఎం.దుర్గారావు, జి. దినేష్, చైతన్య, మణికంఠ తమ ప్రతిభ కనబరిచి రన్నర్స్ గా నిలిచారన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మహారాష్ట్రలో నిర్వహించే జాతీయ స్థాయి జట్టుకు కిరణ్ కుమార్, వెంకటేష్, దుర్గారావు లు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ విజేతలుగా నిలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి. కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తదితరులు అభినందించారు.







