UPDATED 19th JUNE 2017 MONDAY 11:30 AM
పెద్దాపురం: భక్తుల ఇలవేల్పు మరిడమ్మ అమ్మవారి జన్మదినం సందర్భంగా దేవస్థానంలో సోమవారం ఉదయం వైభవంగా హరిద్ర కలశాభిషేకం నిర్వహించారు. దీనిలో భాగంగా 108 మంది మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్.పుష్పనాథం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే దేవస్థానం ఛైర్మన్ చింతపల్లి బ్రహ్మజీ దంపతులచే ఆయుష్ హోమం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రముఖ వేదపండితులు చిట్టెం హరిగోపాల్ శర్మ, ఎన్.వి. శాస్త్రి అవధాని, అప్పల భానుమూర్తి, ఐ.వి. ప్రసాద్ పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛరణాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఆకుల మురళీకృష్ణ, కొంగర సత్యనారాయణ, తమ్మన మైనర్ బాబు, కొఠాని గణేష్, గోమాడ అర్జున్, రాయి విజయ్, శ్రీనివాస భక్త మండలి సభ్యులు, సిబ్బంది శివ, గౌరి, వరహాలు, లోవ తదితరులు పాల్గొన్నారు.







