YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు.. మళ్లీ మొదలైన సీబీఐ విచారణ

UPDATED 14th FEBRUARY 2022 MONDAY 06:00 PM

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. కడప జిల్లా పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణకు ముగ్గురు అనుమానితులు హాజరయ్యారు. గతంలో కడప జిల్లా సాక్షి బ్యూరోగా పని చేసి, ప్రస్తుతం నెల్లూరు బ్యూరోగా పని చేస్తున్న బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చెప్పారు శివశంకర్ రెడ్డి. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు.

పులివెందులకు చెందిన యుసిఐల్ ఉద్యోగి (యురేనియం కర్మాగారం) ఉదయ్ కూమార్ రెడ్డిని కూడా సీబీఐ బృందం విచారిస్తోంది. రెండు రోజుల క్రితమే కర్మాగారం వెళ్లిన సీబీఐ అధికారులు ఉదయ్ గురించి ఆరా తీశారు. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి ప్రకాశ్ రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం మోపింది. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us