ఆగస్ట్ 9న అటవీ హక్కుల గుర్తింపు పట్టాలు పంపిణీ

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య

UPDATED 27th JUNE 2020 SATURDAY 7:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006 క్రింద అర్హత పొందిన గిరిజన కుటుంబాలకు రానున్న ఆగస్ట్ తొమ్మిది ఆదివాసీ దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సబ్-కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు.  స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలుకు మూడవ దశలో చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై ఏడు మండలాలకు చెందిన తహసీల్దార్లు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అటవీ హక్కుల గుర్తింపు చట్ట ప్రకారం 2005 డిశంబరు 13 లోపు సాగులో ఉన్న కొండపోడు భూములకు ఇప్పటివరకు పట్టాలు పొందని వారికి ఒక అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, అర్హత గలిగి క్లెయిమ్ చేసుకున్న వారికి పట్టాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అటవీ, రెవిన్యూ సిబ్బంది ఈ చట్టం అమలుకు సంబంధించి వివిధ స్థాయిలలో కమిటీల నిర్ణయాలకు అనుగుణంగా అర్హులకు పట్టాలు జారీకి చర్యల తీసుకోవాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం గిరిజనులకు ఎంతగానో ఉపకరిస్తుందని, ఈ చట్టం ద్వారా జీవ వైవిధ్యం, అటవీ సంరక్షణ హక్కు, అలాగే సంరక్షణ ద్వారా ఆహార భద్రత కల్పించుకునే హక్కును కల్పించడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో వివిధ సర్వేలు నిర్వహించడం ద్వారా అర్హతలను నిర్ధారించి పట్టాలు జారీకి స్థాయి కమిటీల నిర్దయాల ద్వారా ప్రయత్నించాలని సూచించారు. గతంలో తిరస్కరించిన క్లెయిమ్ లు మరలా పునర్ విచారణ జరిపి అర్హతలను పరిశీలించాలని, దరఖాస్తు తిరస్కరణకు గురైతే అందుకుగల కారణాలను దరఖాస్తుదారునికి ఖచ్చితంగా తెలపాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులో గ్రామ రెవిన్యూ అధికారులు, అటవీ బీట్ అధికారులు పాత్ర ఎంతో కీలకమని, జిపిఎస్ కోర్డినేట్స్ ఆధారంగా సాగులో ఎప్పటినుంచి ఉందో నిర్ణయించడం జరుగుతుందని, సరిహద్దులు సక్రమంగా గుర్తించి అర్హత మేరకు భూములపై హక్కులు సంక్రమింపజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం. సరస్వతి, ఏడు  మండలాలకు చెందిన తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us