29 న ఆదిత్యలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

UPDATED 26TH may 2017 FRIDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 29 న ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రముఖ ఐటి కంపెనీ టెక్ మహేంద్రా సంస్థ ప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూకు హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు హాజరు కావొచ్చన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ గా నియమించి హైదరాబాద్ లో పనిచేయవలసి ఉంటుందన్నారు. అలాగే వీరికి వార్షిక వేతనం రూ. 1 .5 లక్షల నుంచి 1 .8 లక్షల వరకు వేతనం  లభిస్తుందన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే ఇతర వివరాలకు ఆదిత్య ప్లేసెమెంట్ విభాగం ఫోన్ నెంబర్లు 7660916662, 9704076661 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us