UPDATED 22 JANUARY 2022 SATURDAY 09:30
నల్గొండ (రెడ్ బీ న్యూస్) : జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి. శ్రీరామలింగేశ్వర స్వామి గుట్ట దగ్గర గొబ్బలమ్మ తల్లి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసి తవ్వకాలు జరిపారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







