వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆదిత్య విద్యార్థి ప్రతిభ

UPDATED 8th NOVEMBER 2017 WEDNESDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న బి. అనుష్ బాబు ఈ నెల ఐదున రాజమహేంద్రవరంలో నిర్వహించిన జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరం శ్రీ గౌతమి వ్యాయమ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పురుషుల, మహిళా డెడ్ లిఫ్ట్ ఛాంపియన్-2017 పోటీల్లో బి.అనుష్ బాబు విశేష ప్రతిభ కనబరచడం తమ   కళాశాలకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థిని వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, సివిల్ బ్రాంచ్ విభాగాధిపతి పి.రవికిషోర్, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ వి. సతీష్ కుమార్ తదితరులు అభినందించారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us