UPDATED 18th AUGUST 2022 THURSDAY 07:00 PM
Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ సింగరాయ్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు ఫీమేల్ లీడ్ లో నటించారు. కరోనా ఇబ్బందులు దాటుకొని మరీ గత సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి విజయం సాధించింది. మొదటి సారి నాని ఓ పీరియాడిక్ పాత్రలో నటించారు. సాయి పల్లవి అద్భుతమైన నటన, డ్యాన్స్ కి బాగా పేరు వచ్చింది.
ఇక ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయి మరిన్ని రికార్డులు సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక రేటింగ్‌ను సాధించి దాదాపు 10 వారాల పాటు టాప్ ట్రెండ్‌లో ఉంది శ్యామ్ సింగరాయ్. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాని భారతదేశం తరపున మూడు విభాగాలలో ఆస్కార్ నామినేషన్లకు పంపిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు.







