ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

UPDATED 13th JUNE 2017 TUESDAY 11:00 AM

పెద్దాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే నాణ్యమైన విద్య లభిస్తున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక బాలికల పాఠశాలలో పట్టణ, మండల పరిధిలో ఉన్న విద్యార్థినులకు ఆయన చేతుల మీదుగా మంగళవారం  సైకిళ్ళు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం జరుగుతోందన్నారు. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లు హోం మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రెవిన్యూ శాఖ ద్వారా విద్యార్థులకు ధృవపత్రాలను అందచేశారు. అలాగే వికలాంగులకు ట్రై  సైకిల్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముత్యాల వీరభద్రరావు( రాజబ్బాయి), మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొరుపూరి రాజు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరావు, ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, పట్టణ టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, మున్సిపల్ కమీషనర్ బిఆర్ శేషాద్రి, మండల విద్యాశాఖాధికారి జివిఆర్ దుర్గాప్రసాద్, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపీడీవో వసంత మాధవి, ప్రధానోపాధ్యాయుడు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us