రెడ్ బీ న్యూస్, 31 డిసెంబర్ 2021: టీమ్‌ఇండియా కుర్రాళ్లు అదరగొట్టేశారు. వరుసగా మూడోసారి అండర్ -19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుని సత్తా చాటారు. స్వల్ప స్కోర్లు నమోదైన ఆసియా కప్ తుదిపోరులో శ్రీలంకపై తొమ్మిది వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్) భారత్ ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 38 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 106 రన్స్ చేసింది. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం టీమ్ఇండియా లక్ష్యం 102 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్ రఘువన్షి (56*), తెలుగు కుర్రాడు రషీద్ (31*) రాణించడంతో 21.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ హర్నూర్ సింగ్ (5) నిరాశపరిచాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో ఏడు సార్లు భారత్ గెలవగా.. ఒకసారి పాకిస్థాన్‌తో పంచుకుంది. బౌలింగ్‌లో చెలరేగిన యువభారత్ శ్రీలంక బ్యాటర్లను ఏమాత్రం పుంజుకోనీయకుండా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు పడగొడుతూ చివరి వరకు ఆధిక్యం కనబరిచారు. లంక బ్యాటర్లలో చమిందు విక్రమసింఘె 2, డానియల్ 6, బండారా 9, రాజపక్స 14, పవర్ 4, రానుడ 7, వెల్లలాగే 9, రవీన్ 15, యాసిరు 19, పతిరాన 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో విక్కీ 3, తంబే 2.. రాజ్‌వర్థన్, రవి కుమార్, రాజ్ తలో వికెట్ తీశారు.







