UPDATED 22nd JULY 2017 FRIDAY 7:00 PM
పెద్దాపురం: రెవిన్యూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.మల్లిఖార్జున తహసీల్దార్లను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి తహసీల్దార్, సర్వేయర్, సివిల్ సప్లై, రెవిన్యూ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని అందించాలన్నారు. సమాచార కేంద్రంలో సిబ్బందికి రెవెన్యూ విషయాలపై పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, రేషన్ కార్డు, జనన మరణ ధ్రువ పత్రాలు మొదలైన పత్రాల జారీలోి జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నీటి తీరువా వసూళ్లను వేగవంతం చెయ్యాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రేషన్ దుకాణాలు తహశీల్దార్లు తనిఖీ చెయ్యాలనున్నారు. అనంతరం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, కార్యాలయ ఏవో విద్యాసాగర్, పెద్దాపురం తహసీల్దార్ గోగుల వరహాలయ్య, డివిజన్లోని రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.







