UPDATED 25th JULY 2017 TUESDAY 11:30 PM
చెన్నై: వందేమాతరం జాతీయ గేయాన్ని అందరూ తప్పనిసరిగా పాడాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై తమిళనాడులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం గేయాన్ని ఆలపించాల్సిందేనని జస్టిస్ మురళీధరన్ తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. స్కూళ్లలో అయితే వారానికి కనీసం ఒక్కసారి, ప్రభుత్వ కార్యాలయాల్లో నెలరోజుల్లో ఒక్కసారైనా జాతీయ గేయాన్ని ఆలపించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. సోమ, శుక్రవారాల్లో ఒకసారైనా వందేమాతరం పాడాలని ధర్మాసనం సూచించింది. ఒకవేళ ఎవరైనా పాడకపోతే వారిపై ఒత్తిడి తేకూడదని, దేశభక్తి అనేది ప్రతీ భారతీయ పౌరుని కనీస బాధ్యత అని హైకోర్టు పేర్కొంది. వందేమాతరం లోని బెంగాలీ, సంస్కృత పదాలు కఠినంగా ఉంటే తమిళంలోకి అనువాదం చేసుకొని పాడాలని జస్టిస్ మురళీధరన్ సూచించారు.







