కిట్స్ కళాశాలలో నాక్ బృందం పరిశీలన

UPDATED 23rd MAY 2017 MONDAY 11:00 PM

పెద్దాపురం : పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యుజిసి) పర్యవేక్షణలో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కమిటీ (నాక్) బృందం పరిశీలించింది. కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, ల్యాబ్, క్లాస్ రూమ్స్, సిబ్బంది, భవనాలు విద్యాబోధన నాణ్యతా ప్రమాణాలు, రికార్డులు మొదలైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. బెంగుళూరు నుంచి వచ్చిన ఈ బృందంలో హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ (హెచ్ సి యు) ధర్మశాల వైస్ ఛాన్సలర్ డాక్టర్ వై.ఎస్ వర్మ, కురుక్షేత్ర ఎన్ఐటి అసోసియేట్ డీన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ డాక్టర్ చక్రవర్తి , పిసిఐ మెంబర్, సైంటిస్ట్ డాక్టర్ రాహుల్ రాథోడ్ లతో కూడిన బృందం ఇంజనీరింగ్ కళాశాలలకు గ్రేడింగ్ ఇచ్చేందుకు ఈ తనిఖీలు నిర్వహించారు. సుమారు మూడు రోజుల పాటు కళాశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నాక్ బృందం సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఏవో కె.ఆర్ సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసివో పెదకాపు తదితరులు పాల్గొన్నారు.         

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us