UPDATED 19th SEPTEMBER 2017 TUESDAY 8:00 PM
పెద్దాపురం: అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మండలంలోని చదలాడ గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. పార్టీలో ప్రతీ ఒక్క కార్యకర్త కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాపు కులస్తులకు త్వరలో బిసి రేజర్వేషన్లు కల్పించి వారికి విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు ఎంతో శ్రమకోర్చి సమస్యల పరిష్కారానికి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించేందుకు కష్టించి పనిచేయాలన్నారు. ఎం ఎల్ సి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ కష్టించే కార్యకర్తలకు టిడిపిలో సముచిత స్థానం లభిస్తుందని, అలాగే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టడమే కాకుండా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటీసి సుందరపల్లి శివనాగరాజు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, ఎఎంసి వైస్ చైర్మన్ ఆచంట రాజబాబు( రాజన్న), టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు( కోటి), సామర్లకోట ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు( శ్రీనుబాబు), పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, సీనియర్ టిడిపి నాయకుడు పచ్చిపాల సత్తిబాబు, పచ్చిపాల సతీష్, గవరసాన రాజశేఖర్, తోట రామకృష్ణ , పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు పాల్గొన్నారు.







