Krishnamraju: రెబల్‎స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

UPDATED 11th SEPTEMBER 2022 SUNDAY 07:00 AM

Krishnamraju: టాలీవుడ్‎లో (Tollywood) విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (Rebel star Krishnamraju) (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి (AIG Hospital)లో చికిత్సపొందుతూ కృష్ణంరాజు కన్నుమూరు. 1940 జనవరి 20న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

1966లో 'చిలకా గోరింక' చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. 187కు పైగా చిత్రాల్లో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నటించారు. ‘అవేకళ్లు’ చిత్రంలో రెబల్ విలన్ గానూ నిరూపించుకున్నారు. కృష్ణంరాజు 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో 'తాండ్రపాపారాయుడు' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us