సత్యదేవుడి హుండీల ఆదాయం రూ.46.39 లక్షలు

అన్నవరం, 12 నవంబరు 2020 (రెడ్ బీ న్యూస్): సత్యదేవుడికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా రూ.46,39,228 నగదు, 75 గ్రాముల బంగారం, 235 గ్రాముల వెండి మొదలయినవి 14 రోజులకుగాను ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. లెక్కింపులో దేవస్థానం ఉద్యోగులు, వ్రతపురోహితులు పాల్గొన్నారు. లెక్కింపు ప్రక్రియను ఈవో త్రినాథరావు, సహాయ కమిషనర్ రమేష్ బాబు తదితరులు పర్యవేక్షించారు. హుండీల లెక్కింపులో దేవస్థానం ఉద్యోగులు, వ్రతపురోహితులు పాల్గొన్నారు. హుండీల లెక్కింపులో భాగంగా రెండో గ్రేడు వ్రతపురోహితుడు వోలేటి శ్రీనివాస శర్మ చేతివాటం ప్రదర్శించి రూ.11,310 తస్కరించాడు. లెక్కింపు తర్వాత ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. దీంతో అతడిని విధులనుంచి తొలగిస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. మరో నెల రోజుల్లో మొదటి గ్రేడు పురోహితుడిగా పదోన్నతి పొందాల్సి ఉండగా అతడు ఈ చర్యకు పాల్పడడంతో తక్షణమే విధుల నుంచి తొలగించడంతో రత్నగిరిపై ఈ అంశం చర్చనీయాంశమైంది. గతంలో ఒక వ్రతపురోహితుడు హుండీ లెక్కింపులో చోరీ చేయడంతో అప్పట్లో చేపట్టిన చర్యలనే మళ్లీ చేపట్టారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us