సికింద్రాబాద్ (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ రద్దీగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా తాజాగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరనున్న ఈ సువిధ ప్రత్యేక రైలు (నెం 82725) మరుసటిరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖ చేరుకోనుందని తెలిపింది. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది. ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ సీటింగ్ కోచ్ లు ఉంటాయని తెలిపింది. ఈ రైలు సేవలు పూర్తిగా రిజర్వేషన్ చేయించుకున్నవారికేనని స్పష్టంచేసింది.







