TTD : తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం

చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. దీంతో టోకెన్ల కోసం స్థానికులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 50 వేల దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. సోమవారం ఉ.9గంటలకు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ మొదట ప్రకటించింది. అయితే క్యూలైన్ల దగ్గరకు స్థానికులు భారీగా చేరుకున్నారు. ఒక్కసారిగా భక్తుల తాకిడి తగలడంతో టీటీడీ ముందస్తుగా టోకెన్లు జారీ ప్రారంభించింది. ఈ నెల 13 నుంచి టీటీడీ అధికారులు రోజుకు 5 వేలు చొప్పున టోకెన్లు జారీ చేయనున్నారు. లోకల్‌ ఆధార్ చూపిన వారికే దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us