UPDATED 19TH MAY 2017 FRIDAY 5:00 PM
పెద్దాపురం: స్థానిక వరహాలయ్య పేటలో యాసలపు సూర్యారావు భవనంలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చల పల్లి సుందరయ్య వర్థంతి సభ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. వేణుగోపాల్, సిపిఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు, నాయకురాలు ఎం వీరలక్ష్మి తదితరులు హాజరై మాట్లాడుతూ సుందరయ్య చూపిన బాటలో ఆయన స్పూర్తితో ముందుకు సాగలన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు గీతాలతో సుందరయ్యకు నివాళులర్పించారు. సుందరయ్య త్యాగాల బాటలో పయనించి, కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, దారపురెడ్డి కృష్ణ, రాజు, కంచుమర్తి కాటంరాజు, మహాపాతిన రాంబాబు, కె.నాగు, సిరిపురపు శ్రీనివాస్, మరిడయ్య, దాడి బేబి , అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







