సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదం

UPDATED 21st JUNE 2017 WEDNESDAY 3:00 PM

గండేపల్లి: సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహద పడుతుందని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో  నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదిత్య ఎన్ ఎస్ ఎస్ విభాగంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ యోగా మన సంస్కృతని, ప్రాచీన వారసత్వ సంపదని, మన దేశ ఔన్నత్యానికి ప్రతీకని అన్నారు. ఆరోగ్యానికి ఆయుర్వేదం చికిత్సను కనుగొన్నది మన దేశమే అని, గణితానికి పెద్ద పీట వేసి కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమి నుంచి సూర్యునికి గల దూరాన్ని ఖచ్చితంగా చెప్పగలిగిన మన దేశ మేధావుల గొప్పతనం అని అన్నారు. ఆరోగ్యవంతమైన శారీక దారుఢ్యం కోసం యోగా ఎంతో మంచిదని, ప్రతీ ఒక్కరూ యోగాభ్యాసం  చేయాలని సూచించారు. అనంతరం ఆదిత్య విద్యార్థులచే ప్రముఖ యోగా గురువు ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.ఎన్. మూర్తి యోగాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ రమాశ్రీ, రాయుడు శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us