అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యూఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతో పాటు మరో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసుల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను గుర్తించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.







