మహాపాదయాత్రకు తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు

పెద్దాపురం, (రెడ్ బీ న్యూస్)10 నవంబర్ 2021: రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు పెద్దాపురం పట్టణం నుంచి టీడీపీ శ్రేణులు బుధవారం తరలివెళ్లారు. కాకినాడ పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని ఆధ్యర్యంలో తరలివెళ్లారు. అనం తరం వారు మాట్లాడుతూ అమరావతీ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసేందుకు అమరావతీ ఉద్యమ పరిరక్షణకు రైతుల చేపట్టిన ఉద్యమానికి ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్ర పరిరక్షణకు రాష్ట్ర భవిష్యత్ కోసం భూముల త్యాగం చేసిన రైతులకు సంఘీభావం తెలియచేసేందుకు తాము తరలివెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, తెలుగు యువత మాండలాధ్యక్షుడు నూనే రామారావు, తుమ్మల నాని, మెయిళ్ల నాగేశ్వరరరావు. బేతినీడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us