Updated 8th March 2023 Wednesday 8:10 am
Robot Mini Tractor : టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. మరి అన్నింటి కంటే ముఖ్యమైన వ్యవసాయ రంగంలో సాంకేతిక పురోభివృద్ధి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అనేందుకు పలు ప్రయోగాలు జరుగుతున్నాయి.. ఇప్పటికే అనేక రంగాల్లో ఆటోమేషన్ (Automaton) ప్రవేశించింది. సమీప భవిష్యత్తులో వ్యవసాయంలోనూ యంత్రాలదే ఆధిపత్యం కానుందా అంటే అవును అనే సమాధానం చెప్పాలి.. అసలు కూలీలే లేకుండా పూర్తిగా యంత్రాలతోనే సేద్యం చేయించడం, కలుపుతీయడం, మందులు పిచికారీ చేయడం సాధ్యమేనా అంటే ?.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే డ్రైవర్ లేకుండానే నడిచే ట్రాక్టర్లను, పంట నూర్పిడి యంత్రాలను రూపొందించారు. దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం నుంచి కోతల వరకు అన్ని పనులనూ మానవ రహిత యంత్రాలే చేసేస్తున్నాయి. వ్యవసాయంలో యంత్రాల వినియోగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది అనడంలో. సందేహమే లేదు.. ఆధునాతన రోబో ట్రాక్టర్లు డ్రైవర్లు లేకుండానే నడుస్తున్నాయి.
వ్యవసాయ క్షేత్రంలో కూలీల కొరతను అధిగమించడానికి వచ్చిన నూతన ఆవిష్కరణలో భాగంగా పవర్ విడర్ కానీ, పవర్ టిల్లర్ కానీ స్మాల్ సైజ్ రోటావేటర్ కానీ ఒక స్మాల్ ట్రాక్టర్ (Small Tractor) చేసే పనిని ఈ రోబోట్ (Robot) చేస్తుంది. ఈ రోబోట్ చూడడానికి సేమ్ ఒక చిన్న ట్రాక్టర్ సైజులో ఉంటుంది. దీనిని వ్యవసాయ క్షేత్రంలో అనేక రకాలుగా వాడవచ్చు. రోబోట్ ట్రాక్టర్ కొనుగోలు చేస్తే దీని వెనకాల కంపెనీ వాళ్ళు ఇచ్చే ఇంప్లిమెంట్ సహాయంతో కలుపు నివారణలో టిల్లర్ సహాయంతో కలుపు తీయడానికి వాడవచ్చు. అదేవిధంగా స్మాల్ కల్టివేటర్ సహాయంతో కల్టివేట్ చేసుకోవచ్చు. అలానే పొలాలకు మందు పంపు కొట్టడానికి ఇచ్చే 180 లీటర్ల స్ప్రేయర్ తో పంటలకు మందు కూడా కొట్టవచ్చు. ఇలా ఎన్నో రకాల వ్యవసాయ పనులను ఒక చోట నిలబడి రిమోట్ కంట్రోల్ సాయంతో పనిని ఈజీగా చేయవచ్చు.
వ్యవసాయానికి సంబంధించి మన తెలుగు రైతులు ఇలాంటి ఇంప్లిమెంట్స్, ఇలాంటి ట్రాక్టర్స్ వాడాలి అన్నా అది పంజాబ్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటిది మన తెలుగు స్టేట్స్ లో వ్యవసాయాన్ని సంబంధించి ఇలాంటి ఇన్నోవేషన్ అనేది వ్యవసాయ క్షేత్రంలో మంచి మార్పు అనే చెప్పొచ్చు. ఈరోబోట్ ద్వారా ఎకరానికి కలుపుని కేవలం రూ.40 నుంచి రూ.50తో కలుపు తీసుకోవచ్చు. అలాగే ఈరోబోను నాలుగు గంటలు ఛార్జ్ చేసుకుంటే ఎనిమిది గంటలవరకూ పనిచేస్తుంది. స్ప్రేయింగ్ నాలుగు ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు చేసుకోవచ్చు. ఎటువంటి భూముల్లో అయినా ఇది పనిచేస్తుంది. మెట్ట పొలాల్లో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.
పొలంలో తేమశాతం ఎలా ఉన్నా పనిచేస్తుంది. ఒక ట్రాక్టర్ చేసే అన్ని పనులను ఇది చేస్తుంది. దీని విలువ రూ. రెండున్నర లక్షల నుంచి రూ.3.75 వరకూ ఉంటుంది. అలాగే బ్యాటరీకి మూడు సంవత్సరాలు వారంటీ, సంవత్సరం పాటు ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది. ఈలోపు సమస్య ఎదురైతే నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి రిపేరు చేయడం జరుగుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వివరాలకు ఏ - ఐడీఈఏ, నార్మ్ , రాజేంద్రనగర్ మండలం, హైదరాబాద్ ను సంప్రదించాలని ప్రతినిధులు కోరుతున్నారు.







