Updated : 7th April, 2017, Friday 3:10 Pm
పెద్దాపురం : దంతాల సంరక్షణపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోఎన్ ఎస్ ఎస్ సేవా శిబిరం లో భాగంగా నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ దంతాల సంరక్షణలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఈశిబిరంలో కెయల్ఎన్ లెనోరా దంత వైద్యశాల (రాజమహేంద్రవరం) వైద్యులు తమ వైద్య సేవలను అందించారు. సుమారు ౩౦౦ మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, కార్యనిర్వహణాధికారి కేఆర్ సందీప్, ఈవో జెన్నిబాబు,ఏసిఓ కొంగర పెదకాపు, వైద్యులు డాక్టర్ కమల్ షా, అన్వేష్, కార్తీక్, హౌస్ సర్జన్స్, డాక్టర్ ప్రవీణ్,అపర్ణ, బీబి, సాహితి, హారిక, ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ సత్తిబాబు మెయిళ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.







