మైక్రోసాఫ్ట్ కు 16 మంది ప్రగతి విద్యార్థులు ఎంపిక

UPDATED 28th AUGUST 2017 MONDAY 7:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్  కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థులు 2017-18 సంవత్సరానికి  మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ పార్టనర్స్(ఎం ఎస్ పి) కు ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంస్థ 620 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ప్రత్యేకించి తమ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ఎంపిక కావడంతో పాటు, దేశవ్యాప్తంగా మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఎంపిక కావడానికి తమ కళాశాల అధ్యాపక బృందం చేసిన కృషిని ఆయన అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఇంతటి ఘన విజయాన్ని సాధించి చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారన్నారు. 29 మంది మైక్రో సాఫ్ట్ స్టూడెంట్ పార్టనర్స్ తో బిట్స్ పిలాని ప్రథమస్థానం, 21 మంది మైక్రో స్టూడెంట్ పార్టనర్స్ తో ఐఐటి ఢిల్లీ ద్వితీయ స్థానం సాధించగా, అంతటి అత్యున్నత ప్రమాణాలతో కూడిన దిగ్గజ విద్యాలయాలకు ధీటుగా తమ కళాశాల విద్యార్థులు మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు. ఈ గుర్తింపు వల్ల తమ విద్యార్థులు మరింతగా ఉద్యోగావకాశాలు పొందుతారన్నారు. మైక్రోసాఫ్ట్ యాక్టివిటీస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.వి. రమణమూర్తి మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ పార్టనర్స్ అనేది అత్యంత బాధ్యతాయుతమైన స్థానం అన్నారు. విద్యార్థులు సాంకేతికపరంగా చోటు చేసుకుంటున్న ఆవిష్కరణలను సమాజంలో వ్యాపింపచేయాలని దానికోసం అంతర్గత కళాశాల, అంతర్ కళాశాల స్థాయిలో సెమినార్లు, వర్క్ షాప్స్, గెస్ట్ లెక్చర్స్ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ పార్టనర్స్ గా  ఎంపికైన విద్యార్థులకు సంస్థ, అనుబంధ సంస్థలలో ఇంటర్న్ షిప్ ఉద్యోగావకాశాలు పొందుతారన్నారు. అనంతరం చైర్మన్ కృష్ణారావు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ మేనేజ్మెంట్ ఎం.వి.హరనాథ్ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.ఎస్.మాచిరాజు,  వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us