Updated 2nd December 2022 2:15 pm
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ మూవీని పూర్తీ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రాజకీయ వ్యవహారాలు వల్ల సినిమా షూటింగ్ చాలా లేటు అవ్వడంతో, పవన్ సాధ్యమైనంత త్వరగా తన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తీ చేసి బయటకి రావాలని చూస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో వెయ్య మంది ఆర్టిస్ట్ లు మధ్య పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మూవీ టీమ్. తాజాగా పవన్ కళ్యాణ్ ‘BMW R1250 GS’ మోడల్ బైక్ వేసుకొని ఫిల్మ్ సిటీ లో చక్కర్లు కొడుతున్న వీడియో బయటకి వచ్చింది. షూటింగ్ విరామం సమయంలో పవన్ బైక్ వేసుకొని రయ్యి రయ్యి మంటూ రైడ్ చేస్తూ కాసేపు సరదాగా తిరిగారు.
ఆ సమయంలో కొందరు ఆ దృశ్యాన్ని వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కాస్త వైరల్ కావడంతో, అభిమానులు పవన్ ‘గోపాల గోపాల’ సినిమాలోని “వేగం నడిచే ఇంజిన్‌లో ఉండదు మిత్రమా, నడిపేవాడి నరాల్లో ఉంటది” అనే డైలాగ్ ని కామెంట్ చేస్తున్నారు. కాగా డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం ప్రీ ఇంటర్వెల్ సీన్ తెరకెక్కిస్తున్నాడట. పవన్ కెరీర్ లోనే ఇది బెస్ట్ గా నిలవనుంది అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు.







