Adipurush: ఆదిపురుష్ అనుకున్న సమయానికి రావడం కష్టమేనా..?

Updated 18th December 2022 Sunday 5:10 pm

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఆదిపురుష్’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుంది. అయితే ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినా, ఈ చిత్ర టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను జూన్ 16కు మార్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో వస్తుందా అని అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత ఆలస్యం కానున్నాయని తెలుస్తోండటంతో ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు అనుకున్న దానికంటే కూడా ఆలస్యంగా జరుగుతున్నాయట. ప్రేక్షకులకు మరింత మంచి అనుభూతిని అందించేందుకు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుందట ఆదిపురుష్ టీమ్.

దీంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని తెలుసుకున్న ఆడియెన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరి నిజంగానే ఆదిపురుష్ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను రామాయణం నేపథ్యంలో తెరకెక్కించగా, ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us