తిరుపతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 201: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తోన్న సభ.. దగాపడ్డ రైతుల సభే కానీ రాజకీయ సభ కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు రఘురామ హాజరయ్యారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ రఘురామకు అమరావతి జేఏసీ నేతలు స్వాగతం పలికారు. రైతులకు మద్దతు కోసం అన్ని వర్గాలు తరలివస్తున్నాయన్నారు. సభ తర్వాత 3 రాజధానుల గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. నూరు శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డుకునే మేఘాలు అశాశ్వతమని.. అమరావతే శాశ్వతం అని రఘురామ అభిప్రాయపడ్డారు.







