అమరావతి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ఏపీలో సీఎం, మంత్రుల పేర్లతో బెదిరింపులు పెరిగాయని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఎంపీల పేర్లతో కబ్జాలకు పాల్పడటం రివాజుగా మారిందని ఆరోపించారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ఠ అని ఆక్షేపించారు. తక్షణమే సీఎం జగన్ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. వేధింపులకు భయపడకుండా బాధితులు పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు కాపీలు తనకు పంపాలని.. బాధితులకు అండగా ఉంటానని సుజనా చౌదరి భరోసా ఇచ్చారు. ఆ కాపీలను saveandhrapradesh2022@gmail.comకు పంపించండని ఎంపీ ట్వీట్ చేశారు.







