UPDATED 11th FEBRUARY 2018 SUNDAY 7:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండల ఎంపీపీగా గొడతా మార్త ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని కాకినాడ ఎంపీ తోట నరసింహం పేర్కొన్నారు. ఈనెల10న రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎంపిపి మార్త అంతిమ యాత్రలో ఆయన పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సామర్లకోట, పెద్దాపురం మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలకుర్తి శ్రీనుబాబు, ముత్యాల రాజబ్బాయి, అడబాల కుమారస్వామి, మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, పెద్దాపురం ఎంపిపి గుడాల రమేష్, జిల్లా ఎంపీపీ సమాఖ్య అధ్యక్షుడు దాసరి వెంకట సత్యన్నారాయణ, ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు వల్లూరి సత్తిబాబు, వల్లూరి సత్యవతి ఎంపీడీవో నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







