AP CM Jagan: 3న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన ..

Updated 1st  January 2023 Sunday 8:10 pm

AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 11గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 1గంట తరువాత అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.40గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us