CM KCR : పార్టీ పేరు మార్పుపై ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్

UPDATEAD 5th OCTOBER 2022 WEDNESDAY 02:00 PM

KCR writes letter to EC: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై ఎన్నికల సంఘానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మారుస్తూ ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయగా, అనంతరం దానిపై సీఎం కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే వివరిస్తూ ఈసీకి కేసీఆర్ లేఖ రాశారు. నేడు చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత బి.వినోద్‌ కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉంది.సీఎం కేసీఆర్‌ కొనుగోలు చేసిన విమానంలో రేపు ఆ బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తుంది. ఈ తీర్మానాన్ని సమర్పించి, దానికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతుంది.

కాగా, బీఆర్ఎస్ లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో దాని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట రైతుల నేతలతో కలిసి కిసాన్‌ సంఘ్‌ ఏర్పాటు చేస్తారు. తెలంగాణ మోడల్ ను ఆయా రాష్ట్రాల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు వివరించనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అమలువుతున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్‌, మిషన్‌ భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, తాజాగా ప్రవేశపెట్టిన దళితబంధుపైనే బీఆర్ఎస్ ఆధారపడనుంది. 2018 నుంచి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

దేశాన్ని ఇన్నాళ్లు పరిపాలించిన కాంగ్రెస్‌, బీజేపీల తీరును ఎండగడుతున్నారు. ఇప్పుడు 2024 లోక్‌స‌భ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us