Updated 13th February 2023 Monday 7:20 pm
CM Jagan : వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. వైసీపీ కో-ఆర్డినేటర్లు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా వైసీపీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు హాజరుకానున్నారు. గృహ సారథులుగా నియమితులైన వారి తుది జాబితాను నిర్దేశిత ఫార్మాట్స్ లో సమర్పించాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను వైసీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో తుది జాబితాను సమర్పించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గృహ సారథుల నియామకాలు పూర్తయ్యాయి. గృహ సారథుల భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. మరోవైపు పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకునే చాన్స్ ఉంది.
ఎమ్మెల్యేల పనితీరు, గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష చేయనున్నారు సీఎం జగన్. ఇప్పటికే దీనిపై చాలాసార్లు వర్క్ షాప్ నిర్వహించారు. ఈసారి మాత్రం కీలకం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారి పని తీరు ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి వర్క్ షాప్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎం జగన్ పూర్తి వివరాలు చెప్పబోతున్నారు.







