విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

UPDATED 1st AUGUST 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండల యుటిఎఫ్ నాయకుడు బొజ్జా అశోక్ పదవీ విరమణను పురస్కరించుకుని స్థానిక అన్నపూర్ణ కల్యాణ మండపంలో ఎంఇవో వై.వి. శివరామకృష్ణయ్య అధ్యక్షతన వీడ్కోలు సభ బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా విశేష సేవలందించి జిల్లా, రాష్ట్రస్థాయిలో అవార్డులు పొందారని, ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది నేడు పదవీ విరమణ చేస్తున్న ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ల విజయలక్ష్మి ఎంపీడీవో సి.హెచ్. జగ్గారావు, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు విశ్రాంత ఎంఇవో కె. వెంకట రమణమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అశోక్ దంపతులను ఘనంగా సత్కరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us