ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో రక్త దాన శిబిరం

UPDATED 1st JUNE 2017 THURSDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం రోటరీ క్లబ్ (కాకినాడ) ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీక్లబ్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు చిరంజీవి రెడ్డి, డాక్టర్ వి.ఆర్.కె. పరమహంస, డాక్టర్ పి. కామరాజు మాట్లాడారు. ప్రతీ సంవత్సరం ఆదిత్య విద్యా సంస్థల ద్వారా సుమారు 4000 యూనిట్ల రక్తాన్నిసేకరిస్తున్నామని రక్తదానం పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ప్రోత్సాహంతోనే జిల్లాలో ఉన్న బ్లడ్ బ్యాంకులు మనుగడ సాగిస్తున్నాయన్నారు. తమకు అవసరమైన ప్రతీసారి ఆదిత్య కళాశాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి రక్తాన్ని అందించిన ఘనత ఆదిత్య విద్యాసంస్థలకు దక్కుతుందని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదిత్య విద్యాసంస్థలు అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ఒక రక్త దాన శిబిరం ద్వారా 2015లో ఆదిత్యలో 1697 యూనిట్ల రక్తం ఇవ్వడం ఇప్పటి వరకు రికార్డు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ప్రిన్సిపాల్స్ ఎం. శ్రీనివాస రెడ్డి , ఎ.రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ రమాశ్రీ, డాక్టర్ ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.       
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us