TTD: సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త

UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 03:40 PM

తిరుమల (రెడ్ బీ న్యూస్): సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కోవిడ్ తగ్గడంతో సర్వదర్శనం భక్తుల సంఖ్య పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలో ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్ ద్వారా 10 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యనూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 10 వేల టికెట్లు జారీ చేశామని చెప్పారు. ఆర్జిత సేవల పునరుద్ధరణపై పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నట్లు జవహర్ రెడ్డి తెలిపారు.

ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళం ఇచ్చిన వారికి ఈనెల 16న ఉదయాస్తమాన సేవా టికెట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఉదయాస్తమాన టికెట్లు బుకింగ్ కు పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా కూడా విరాళాలు ఇచ్చి ఉదయాస్తమాన సేవ టికెట్లు పొందవచ్చని తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us