నెంబర్ వన్ నియోజకవర్గంగా పెద్దాపురం

UPDATED 19th JULY 2017 WEDNESDAY 3:00 PM

పెద్దాపురం: రాబోయే రెండు సంవత్సరాలలో పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజక వర్గంగా తీర్చిదిద్దనున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణంలో పేద మహిళలకు ఆర్ధిక సహకారంతో ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా స్థానిక సిటిజెన్ వెల్ఫేర్ భవనం లో మెప్మా ఐదవ సమాఖ్య వార్షిక మహా జనసభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా బుధవారం హాజరయ్యారు. మహిళల ఎదుగుదలకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల నేడు మహిళలకు స్థానిక సంస్థలలో అవకాశాలు లభించాయని, ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందారన్నారు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని, అన్ని వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి అభివృద్ధి దిశగా రూపుదిద్దుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులు సమన్వయంతో ఆర్థికాభివృద్ధిని పెంచుకోవడానికి అవసరమైన పరిశ్రమలు స్థాపించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులచే కేక్ ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, మెప్మా పిడి రత్నబాబు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, పిపిఆర్వో శైలజ, గాలి లక్ష్మి, పి.భవానీ లక్ష్మి, తూతిక కోమల, మెప్మా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us