ఉంగుటూరు (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది ప్రయాణికులతో వెళ్తన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు భీమడోలు జంక్షన్ వద్దకు రాగానే రోడ్డుప్రక్కన ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భీమడోలు ఎప్స్ వీరభద్రరావు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.







